వలస నిరోధక చట్టాన్ని అమలు చేయాలి

వలస నిరోధక చట్టాన్ని అమలు చేయాలి

– ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం ఆది వాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ని, ఐదవ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు వర్తింపజేశాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలుఏజెన్సీ ప్రాంతాలలో రాష్ట్ర గవర్నర్ తో సంప్రదించి ఆదివాసుల అభివృద్ధి, శాంతి భద్రతలు,నిబంధనలు రూపొందించడానికి, రాష్ట్ర గవర్నర్ అధికారాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. 1959లో షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్టు అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, రాతపూర్వక ఒప్పందంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న స్థిరాస్తులను ఆదివాసుల నుండి బదిలీ చేయడాన్ని నిషేధిం చిందని అన్నారు. 1959 సం.లో చట్టాన్ని సవరణలు చేసి, 1970 చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చి, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అనుకూలంగా భూమి బదిలీ చేయడానికి పూర్తిగా నిషేధించిందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాల పరిధిలో విచ్చల విడిగా ప్రభుత్వ భూములను గిరిజ నేతరులు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. వలస గిరిజనేత రులు రాజకీయ అండ దండలతో ఏజెన్సీలోకి వలసలు వచ్చి వ్యాపారాలు చేసి, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను, ఆదివాసి భూములను కబ్జా చేశారని వాపోయారు. గిరిజనేత రుల వలసలను అడ్డు కోవాల్సిన ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆది వాసులపై ఆదివాసి జీవన విధానాన్ని సాంస్కృతి సాంప్రదాయాలు, విచ్ఛిన్నం చేస్తూ ఆదివాసి చట్టా లను నిర్వీర్యం చేస్తూ, ఆదివాసి జీవన మరణం పోరాటంలోకి నెట్టివేసిందని ఆదివాసి చట్టాలను కాపాడు తామని చెబుతూ నే ఏజెన్సీ ప్రాంతంలో గిరినేతరులకు హక్కులు కల్పించడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. గిరిజనేతరులు వలసలు వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకొని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ నిత్యవసర వస్తువులను అధిక ధరలు కు అమ్ముతూ కోట్ల రూపాయలు కూడ బెట్టుకున్నారని ఆరోపించారు. వలస గిరిజనేతరుల దాడులతో మనుగడ కోల్పోతున్న ఆదివాసుల హక్కులు చట్టాల రక్షణకై భవిష్యత్తులో, ప్రభుత్వం ఐదో షెడ్యూల్ నిబంధనలకు లోబడి రూపొందించాలని, వలస గిరిజనేతరులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుర్స కృష్ణ బాబు, ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, కుర్సం శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment