విస్తృతంగా వాహనాలు తనిఖీలు
– కడేకల్ గ్రామంలో కార్డెన్ సర్చ్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్, పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో సోమవారం ఉదయం అయ్యవారి పేట వద్ద పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్లో పరిధి లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు పేరూరు పిఎస్ పరిధిలోని కడేకల్ గ్రామంలో పేరూరు ఎస్సై కార్ట్ న్ అండ్ చర్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలోకి ఎవరైనా వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా గంజాయి ఇతర మత్తు పదార్థాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బడి వయసు పిల్లలను బడికి పంపించాలని, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంకా అనేక భద్రతాపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. యువత విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై రాణించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో పేరూరు సివిల్ పోలీసులతోపాటు, సిఆర్పిఎఫ్ దళాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.