మా ఐలాపూర్ కష్టాలు తీరేదెన్నడు..!
– పేసా కార్యదర్శి ఆలం నగేష్
కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : కొండాయి నుంచి ఐలాపూర్ గ్రామానికి 12కీ.మీ ఉంటుంది.సర్వాయి నుంచి ఐలాపూర్ 11కీ.మీ. ఉండగా ఐలాపూర్ నుండి రెడ్డిపల్లి 6కీ.మీ. దూరంలో ఉంది.రోడ్లు లేక నరకయాతన పడాల్సి వస్తోంది. రోడ్లు రవాణా సరిగా లేకపోవటంతో గ్రామస్తులకు అవస్తులు తప్పడం లేదు.ఐలాపూర్ నుండి రెడ్డిపల్లి 6కీ.మీ. దూరంలో ఉంది.రోడ్లు లేక నరకయాతన పడాల్సి వస్తోంది. రోడ్లు రవాణా సరిగా లేకపోవటంతో గ్రామస్తులకు అవస్తులు తప్పడం లేదు. కన్నాయిగూడెం మండలంలోని పత్రిక మిత్రులతో ఆలం నగేష్ పెసా కార్యదర్శి మాట్లా డుతూ… తరాలు మారిన మాగూడెం మారాలంటే కొత్త భూమి కొత్త ఆకాశం రావాలి అన్నట్లు ఉంది.కాగితాలకే పరిమితం అయిందని, ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు 6నెలలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి నరకం చూడవలిసిందే,ప్రభుత్వలు మారిన పాలకులు మారిన మా బ్రతుకులు మాత్రం మారడం లేదు. రాజ్యాలు మారిన రాజులు మారిన మా ఆదివాసి గూడెం మార్చే రాజులే కరువైయారు..పట్టణాలలో రోడ్ల మీద రోడ్లు వేసి , మౌలిక సౌకర్యాలు కలిపించటానికి వేయిల కోట్లు కేటాయిఇస్తారు, కానీ మా ఐలాపూర్ ఆదివాసి గ్రామానికి కొండాయి నుండి ఐలాపూర్ వరకు పది కిలో మీటర్ల తారు రోడ్డు వెయ్యటానికి లో బడ్జెట్ చూపిస్తారు. గద్దెలెక్కే దాకా మేమున్నాది వెనుక బడిన ప్రాంతాలకోసమే మరియు బడుగు బలహీన వర్గాల కోసమే అని మైకులు బద్దలు పగిలేలా మాట్లాడుతారు, కానీ గద్దెలు ఎక్కిన తర్వాత కథం కంటికి మనం ఇంటికి అన్నట్లు ఉంది..ఎన్నికల సమయం రాగానే ఎన్ని కష్టాలు పడైన ఓట్ల కోసం మేము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు గెలిసిన తర్వాత చేసేది ఏమి లేదు. మాట మీద నిలబడి చేసేదుంటే 1952 సం నుండి 2024సం వరకు సమస్యలే ఉండేవి కావు. మన దేశం మన రాష్ట్ర ము మిగులు బడ్జెట్ లో ఉండేది, కానీ ప్రజలకు అవసరమైనవి కాకుండా నాయకులకు కమిషండ్లు వచ్చేవే అత్యధికంగా చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమ్మడి మద్రాష్,ఉమ్మడి హైదరాబాద్,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుండి ఇదే పరిస్థితి చూస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము వస్తే అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాలు అభిరుద్ది చెంద్దుతాయి అనుకొని తెలంగాణ వచ్చాక కూడా తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తారు రోడ్డు వేయాలని కోరారు.