గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
– ఆరుగురుపై కేసు, ఇద్దరి అరెస్ట్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు కాటారం, మల్హర్ మండలాలలో గుడుంబా స్థావరా లపై దాడులు నిర్వహించినట్లు కాటారం ఎక్సైజ్ ఇనస్పెక్టర్ నరేందర్ తెలిపారు. కాటారం, మలహర్ మండలాల పరిధిలోని గంట్ల కుంట, కొయ్యూరు తాండ, ఆద్వాల పెల్లి గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు, మరో ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నరేందర్ వివరించారు. ఆయా సంఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు, 45 లీటర్ల గుడుంబా, 50 కేజీల బెల్లం, 50 కేజీల చక్కెరను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా సుమారుగా 2900 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు వివరిం చారు. ఈ దాడుల్లో కాటా రం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నరేందర్, భూపాలపల్లి సిఐ రమ్య రెడ్డి, రాజ సమ్మయ్య, కాటారం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య, రబ్బాని, కాటారం భూపాలపల్లి ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.