స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి
– యూత్ లీడర్ కిషోర్ కుమార్
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతాహి సేవ కార్య క్రమాన్ని ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అద్యక్షులు వావిలాల కిషోర్ కుమార్ మాట్లడుతూ ప్రజలు యువత భాగస్వామ్యం చేసు కొని శ్రమదానాలు చేయాలని చుట్టుపక్కల పరిసర ప్రాంతా లను స్వచ్ఛంగా ఉంచాలని కాళీ ప్రదేశాల్లో మొక్కలు నాట డం తడి చెత్త పొడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిం చడం మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అశోక్ విద్యార్థులు లెక్చలర్లు కెమిస్ట్రీ మామిడి శంకర్, హిస్టరీ లెక్చలర్ బిక్షపతి, కళాశాల సిబ్బంది , అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.