అందరూ బాగుండాలి.. అందులో మేముండాలి…
-విహారయాత్రలో తీపి జ్ఞాపకాలు
– జనగాం జిల్లా పెన్షనర్స్
ములుగు, తెలంగాణ జ్యోతి : అందరూ బాగుండాలి.. అందులో మేము ఉండాలంటూ… ఎంతోమంది విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పిన రిటైర్డ్ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పెన్షనర్ అసోసియేషన్ జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 25 మంది పెన్షనర్లు విహారయాత్ర కార్యక్రమం ఆసక్తిగా చేపట్టారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించి, రామలింగేశ్వర స్వామి నీ దర్శించుకుని తమ విద్యార్థులను, కుటుంబాన్ని, ఆశీర్వదించాలని వేడుకున్నారు. అదేవిధంగా లక్నవరాన్ని చూసుకుని అటు నుండి నేరుగా హనుమకొండ చేరుకుని వేయి స్తంభాల గుడిలోని రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెన్షనర్ మిత్రులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులను అలరించడానికి ఆలయ ప్రాంగణం లో ఎన్నో రకాలైన ఆటలతో ఆనందాన్ని పొందారు. అదే విధంగా లక్నవరంలో బోటింగ్ చేస్తూ ఆనందాన్ని పొందారు. 60 లో 20 లాగా అందరూ తమ తమ హావా భావాలను వ్యక్తపరిచారు. ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల వాళ్ళు నిర్వహించుకొని సంఘాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా దోహద పడతాయని అందరూ అభిప్రాయపడ్డారు. కాగా రిటైర్డ్ ఉద్యోగులను చూసి పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తూ, గురువులకు వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి , జనగామ జిల్లా శాఖ అధ్యక్షులు ఎన్ మహేందర్ రెడ్డి ,కార్యదర్శి హరిబాబు, జనగామ యూనిట్ అధ్యక్షులు కె మహబూబ్ రెడ్డి, కార్యదర్శి కె జగదీశ్వర చారిలు పాల్గొన్నారు.