టీఎస్ డబ్ల్యూ ఆర్ఎస్, టిటిడబ్ల్యూ ఆర్ఎస్ బ్యాక్ లాగ్ ఖాళీలకు ఆహ్వానం
– ములుగు డి సి ఓ యాదగిరి
ములుగు, తెలంగాణ జ్యోతి : టిఎస్ డబ్ల్యూ ఆర్ఎస్, టిటి డబ్ల్యూ ఆర్ఎస్ లో 6,7,,8,9,వ తరగతులలో ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీల సీట్ల ను భర్తీ చేయుటకు 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు ధరఖాస్తు చేసుకోవాలని ములుగు డిసిఓ యాదగిరి ములుగు బాలికల ప్రిన్సిపాల్ శారద, ఏటూరు నాగారం ప్రిన్సిపల్ అంకయ్యలు తెలిపారు. అర్హులైన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని, చివరి తేదీ ఈనెల 23న ఉందని తెలిపారు. ఏప్రిల్ 21న పరీక్ష ఉంటుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆన్లైన్ కొరకు www.tswreis.ac. in సంప్రదించాలని తెలిపారు.