మానవత్వం చాటిన కాటారం ఎస్సై అభినవ్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : ఫిబ్రవరి 4 ఆదివారం రోజున తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షకు హనుమకొండ జిల్లా పరకాల ఒగ్లాపూర్ లోని ఎగ్జామ్స్ సెంటర్లో ఉదయం 10 గంటలకు హాజరు కావలసిన మహా ముత్తారం మండలం వజ్నెపల్లి కి చెందిన తొట్ల రశ్మిత కాటారం మండల మేడిపల్లి ప్రధాన రహదారి వద్ద ఊరుకొలుపు వల్ల ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. అక్కడ విధులు నిర్వహి స్తున్న కాటారం ఎస్సై అభినవ్ మానవతా దృక్పథంతో తొట్ల రష్మితని తన సొంత ఖర్చులతో ఒక కారుని మాట్లాడి సమయానికి పరీక్షకు హాజరయ్యే విధంగా స్పందించారు.సమయానికి సహాయం అందించి తన ప్రవేశ పరీక్ష కి హాజరయ్యేటట్టు ముందుకు వచ్చిన ఎస్ఐ అభినవ్ గారికి విద్యార్థిని రశ్మిత మరియు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.