జీతాల కోసం ఉద్యోగుల పడిగాపులు
– పండుగకు పస్తులేన, వేతనాలు రాక పశు వైద్య వాహన ఉద్యోగుల వేదన
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మాకు జీతాలు ఇవ్వండి మహాప్రభో అని జీతాలు రాని సంచార వైద్యలు, వాహన సిబ్బంది వేడుకుంటున్నారు. గురువారం సంచార పశు వైద్యురాలు డాక్టర్ అనూష మాట్లాడుతూ పాడి సంపద పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1962 సంచార పశు వైద్య వాహనాల్లో విధులు నిర్వహిస్తున్నవైద్యులు ,సిబ్బందికి కొన్ని నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నా మన్నారు. గత ప్రభుత్వం 2017 లో పశువులకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 వాహనాలు ఏర్పాటు చేసింది. 1962 సంచార పశు వైద్య వాహనం ద్వారా పశువులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో గ్రామాల్లో పశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం గత ఏడాది 1962 వాహనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిం చకపోవడంతో మందుల కొరత ఏర్పడింది ఉన్న మందులతో సిబ్బంది పశువులకు వైద్య సేవలు అందిస్తున్నాము. సిబ్బంది కి సకాలంలో వేతనాలు అందడం లేదు. 1962 వాహనాల బలోపేతానికి నిధులు మంజూరు చేసి మందుల కొరత నివారించి సిబ్బందికి సక్రమంగా వేతనాలు చెల్లించాలని మేము కోరుచున్నాము. 2017 వ సంవత్సరం నుండి ఇంత వరకు ఎలాంటి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదని, సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని అన్నారు. ఈ ఆర్థిక సంవ త్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మాకు ఎలాంటి నిధులు కేటాయించలేదని వారు కోరారు.తక్షణమే కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న మా వేతనాలను విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని, లేదంటే విధులను బహిష్కరించి స్ట్రైక్ చేస్తామ ని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.వీరితో పాటు పారవేట్ ధనుంజయ్ కెప్టెన్ రవితేజ, హెల్పర్ శ్యామ్ లు పాల్గొన్నారు.