డీఈవో కార్యాలయంలో లాప్ టాప్ లు మిస్సింగ్
– పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రెండు లాప్ టాప్ లు మాయమయ్యాయి. వేసిన తాళం వేసినట్లుగానే ఉండగా లాప్ టాప్ లు కనిపించక పోవడంతో డీ ఈ వో కార్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెలలో 5 లాప్ టాప్ లు కార్యాలయానికి రాగా ఆఫీసులో భద్ర పరిచారు. అయితే అందులో రెండు మిస్ కావడంతో ఎవరు తీశారని అంతుపట్టడం లేదు. ఇంటి దొంగలా లేక బయటి దొంగల పనా అనే విషయం పై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై డిఇఓ ను వివరణ కోరగా పక్కా భవనం లేకపోవడంతో భద్రత కరువైందని, లాప్టాప్ లు పోయిన విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.