వాజేడు మండల ఓడబలిజ సంఘం గ్రామ కమిటీల ఎన్నిక

Written by telangana jyothi

Published on:

వాజేడు మండల ఓడబలిజ సంఘం గ్రామ కమిటీల ఎన్నిక

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో ఓడ బలిజ రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ రావు ఆధ్వర్యంలో మండల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎకగ్రివంగా ఎన్నుకున్నారు. వాజేడు మండల అధ్యక్షులు గార నాగార్జున, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లె ఆదినారాయణ ,జిల్లా కమిటీ మెంబర్ ఆదినారాయణల ఆధ్వర్యంలో అద్యక్షులు కి కండువా కప్పి గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా చంటి, ఉపాధ్యక్షులుగా నరేష్ లను ప్రకటించారు. చిన్న గొల్ల గూడెం అధ్యక్షులుగా బొల్లె ఆదినారాయణ, ఉపాధ్యక్షులుగా కుంట నర్సింహారావు , మహిళా అధ్యక్షులుగా పానేం కౌసల్య, ఉపాధ్యక్షులుగా తోట లలిత లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్ర మాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ మాట్లాడుతూ ఓడబలిజ కులస్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ఇప్పటికైనా అందరూ కలిసి ఏకమై కుల వృత్తిని అభివృద్ధి తో ముందుకు సాగించి ఆర్థికంగా ఎదగాలన్నారు. ఓడ బలిజ కులస్తులను ప్రభుత్వం గుర్తించి వారి కుల వృత్తికి రావలసిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఓడబలిజ గ్రామస్తులు పాల్గొ న్నారు. వెనుకబడిన తరగతులుకు చెందిన వాడ బలిజలకు బీసీ సంక్షేమ పథకాలు, అర్హులైన వారందరికీ మంజూరు చేయాలని, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, అర్హులైన ప్రతి వాడ బలిజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని ప్రభు త్వానికి విజ్ఞప్తి చేసారు.

Leave a comment