కొత్తపల్లి ఆలయ అభివృద్ధికి కృషి : మంత్రి శ్రీధర్ బాబు

కొత్తపల్లి ఆలయ అభివృద్ధికి కృషి : మంత్రి శ్రీధర్ బాబు

కొత్తపల్లి ఆలయ అభివృద్ధికి కృషి : మంత్రి శ్రీధర్ బాబు

కాటారం ,తెలంగాణ జ్యోతి : కాటారం మండలంలోని కొత్తపెళ్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని వచ్చే శ్రీరామనవమి కళ్యాణం లోపు ఆలయ అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆదివారం శ్రీరామ నవమీ సందర్భంగా జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో శ్రీధర్ బాబు పాల్గొని ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించారు. దేవాలయానికి రావడం అనుకోకుండా జరిగిందని దేవుడే నన్ను ఇక్కడికి రప్పించాడని శ్రీధర్ బాబు అన్నారు.

కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న శ్రీను బాబు

శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాల్లో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు దుద్దిల్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. మహాదేవపూర్ మండలంలోని బొమ్మపూర్ గ్రామంలో గల శ్రీ మందరగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆకారం మండల కేంద్రం గారితల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవంలో శ్రీనుబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు చేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కొత్తపల్లి ఆలయ అభివృద్ధికి కృషి : మంత్రి శ్రీధర్ బాబు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment