ఆదర్శ లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

Written by telangana jyothi

Published on:

ఆదర్శ లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్లో శనివారం ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రాఖీ వేడుక ల్లో ఆనందోత్సాహాలతో పాల్గొని స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు మాట్లాడుతూ అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్లు ఆత్మీయతకు ప్రతీక రాఖీ పండుగ, తమకు రక్షణగా ఉండాలన్నారు. అంతకుముందు రాఖీ శుభాకాంక్షలు తెలియజేసి రాఖీ ము ఖ్య ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భం గా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, ప్రిన్సిపా ల్ కృషిత, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now