వెంకటాపురంలో వెల్లువెత్తిన వైద్య సిబ్బంది నిరసన

Written by telangana jyothi

Published on:

వెంకటాపురంలో వెల్లువెత్తిన వైద్య సిబ్బంది నిరసన

భారీ ర్యాలీ రాస్తారోకో, స్తంభించిన ఓపి సేవలు 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ  డాక్టర్ మౌమిత డెబాణాత్(31) పై లైంగిక దాడి చేసి చంపిన నేరస్తులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా డాక్టర్ ఓపి సేవలు బంద్ చేయాలని ఇండియన్ డాక్టర్స్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు వెంకటాపురం మెడికల్ షాపు యూనియన్, వెంకటా పురం ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ర్యాలీ గా వేపచెట్టు సెంటర్, బస్టాండ్ సెంటర్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సెంటర్ మీదుగా జగదాంబ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు. బాధిత మహిళా డాక్టర్ కి న్యాయం జరగాలని నిందితులను శిక్షించా లని ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో, వెంకటాపురం సిహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ సూర్య తేజ మాట్లాడుతూ బాధ్యత మహిళా డాక్టర్ కి న్యాయం జరగాలని, ఇతర దేశాల్లో మాదిరిగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు 24 గంటల్లో నిందితులను శిక్షించే విధంగా చట్టాలను మార్పు చేయాలని, గవర్నమెంట్ డాక్టర్లకు భద్రత కల్పించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మెడికల్ యూనియన్ సభ్యులు, ములుగు జిల్లా మెడికల్ యూనియన్ ఉపాధ్యక్షుడు, సత్యదేవ మెడికల్ యజమాని అయిన బచ్చు పూర్ణచందర్రావు, మరియు సభ్యులు, అంకారావు, రామకృష్ణ, జోగారావు, రాంబాబు, రామ్మూర్తి, గ్రామీణ డాక్టర్లు జయ సింహ, రామ్, కోటేశ్వరరావు, వెంకట్, ల్యాబ్ టెక్నీషియన్స్, సాగర్, రాజు, బాబురావు, మల్లేష్, మరియు గవర్నమెంట్ డాక్టర్స్, డాక్టర్ సూర్యతేజ, డాక్టర్ శివాజీ, స్టాఫ్ నర్సులు 108 సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment