ఘనంగా దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రం లోని రామాలయం, సాయి బాబా మందిరలలో మూడవ రోజైన శనివారం అమ్మవారు లలితాదేవి రూపంలో దర్శ నమిచ్చారు. ఆలయంలో అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వ రరావు శర్మ అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున రామాలయం, సాయిబాబా మంది రాలకు చేరుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో భవాని మాల స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.