అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను సందర్శించిన కాటారం డిఎస్పి.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కాళేశ్వరం బార్డర్ చెక్ పోస్ట్ ను సందర్శించిన కాటారం డిఎస్పి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్ట్ వద్ద వాహన రాకపోకల రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలిం చారు. కాటారం డీఎస్పీ సూచనల మేరకు ఎస్సై భవాని సేన్ పోలీస్ సిబ్బందితో మద్యం డబ్బు మత్తు పదార్థాలు గంజాయి ఆయుధాలు తరలిపోకుండా తగు చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు కి వచ్చిపోయే వాహనాలు తనిఖీ చేశారు. అనుమానితులు కనిపిస్తే విచారించి వదిలేశారు. వారి వెంట సి ఆర్ పి ఎఫ్ పోలీసులు ఉన్నారు.