ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళలను కాపాడిన కాళేశ్వరం పోలీసులు.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ మరియు సిబ్బంది కాపా డారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ములుగు ఘనపూర్ కు చెందిన మామిడాల లీల 60 సంవత్సరాలు అనే మహిళ అనారోగ్య పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురై కాళేశ్వరం గోదావరి నదిలో దూకి ఆత్మయత్నానికి పాల్పడగా స్థానికులు గమనించి ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఎస్సై తో పాటు సిబ్బంది వెళ్లి కాపాడారు.