బెస్ట్ అవైలబుల్ గిరిజన స్కూల్ ఎంపిక కు 25న డ్రా
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : గిరిజన విద్యార్థిని విద్యార్థులకు సంబంధించిన గురుకుల పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 25న డ్రా తీయడం జరుగుతుందని ఏటూరు నాగారం ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్ (గిరిజన సంక్షేమం) దేశి రామ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 21 నుంచి ఈనెల ఆరో తారీఖు వరకు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద మూడు, ఐదు, ఎనిమిదో తరగతి ప్రవేశాల గాను దరఖాస్తులు కోరగా, 128 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. కాగా ఈనెల 25న ఉదయం 11:30 గంటలకు ఐటీడీఏ ఏటూరు నాగారం కార్యాలయం యందు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థిని విద్యార్థుల వారి తల్లిదండ్రులు ఈ లక్కీ డ్రాకు హాజరుకావాలని ఆయన కోరారు.