కర్రెగుట్ట రహదారి పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

On: May 21, 2026 4:20 PM

కర్రెగుట్ట రహదారి పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

కర్రెగుట్ట రహదారి పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

త్వరితగతిన పూర్తి చేసి నాణ్యత పాటించాలని ఆదేశం

వెంకటాపురం, మే 21, తెలంగాణ జ్యోతి: మండల పరిధిలోని కర్రెగుట్ట ప్రాంతాన్ని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గురువారం పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మురుమూరు నుంచి పామునూరు, జల్ల, డోలీ మీదుగా తాడపాల వరకు నిర్మాణంలో ఉన్న రహదారి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని సూచించారు. రహదారి నిర్మాణ పనుల నిమిత్తం రాత్రింబవళ్లు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేష్, ఎస్ఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!