గోదావరి నది కరకట్ట స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

Written by telangana jyothi

Published on:

గోదావరి నది కరకట్ట స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : గోదావరి నది కరకట్ట స్థలాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. గురువారం గోదావరి నది పరివాహక ముంపు ప్రాంతాలలో కరకట్ట నిర్మాణం కోసం ఏటూరు నాగారం మండలం రాంనగర్, కోయ గూడెం, రామన్నగూడెం ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. రాంనగర్ ప్రాంతం లో 102 ఎకరాల స్థలాన్ని 6 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణం కోసం 2022 లో సర్వే పూర్తి అయ్యిందని, మంగపేట మండలం లో పొదమనూర్ ముంపు ప్రాంతాలకు 2.5 కిలోమీటర్ల నూతన కరకట్ట నిర్మాణం కోసం 25 ఎకరాల స్థల సర్వే 2022 లో పూర్తి అయిన వివరాలు సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.అనంతరం కలెక్టర్ ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట గ్రామం లో మిరప తోటలను సందర్శించారు.ఈ సందర్భం రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాలానుగుణంగా పంట మార్పిడి చేయాలని సూచించారు. రైతులకు లాబదాయకమైన పంటాలపై అవగాహన మరియు నాణ్యమైన విత్తనాల గురించి అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ భాస్కర్, ఎస్ ఈ మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చందర్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి వేణు, జేఈ, ఏఈ, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment