108 లో గర్భిణీ మహిళ సుఖ ప్రసవం
ఏటూరునాగారం/తాడ్వాయి, తెలంగాణా జ్యోతి ప్రతినిథి : తాడ్వాయి మండలం సింగారం గ్రామానికి చెందిన ఏర్నేని శారద పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. సింగారం గ్రామం చేరుకొన్న 108 సిబ్బంది మహిళ రెండో కాన్పు పరిస్థితిని గమనించి ప్రథమ చికిత్స అందించి 51 మెరుగైన వైద్యం కోసం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ గ్రామం చేరుకోగానే పురిటినొప్పులు అధికం కావడంతో గమనించిన 108 ఈఎంటి శివలింగం ప్రసాద్ చాకచక్యంతో వ్యవహరించి రెండవ కాన్పుకి సుఖ ప్రసవం అయ్యేవిధంగా వ్యవహ రించారు. కాగా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డ కు ఆ మహిళ జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డలకు ప్రథమ చికిత్స అందించి,మెరుగైన వైద్యం కోసం ములుగు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి జరిగిన విషయాన్ని ప్రసూతి వైద్యురాలికి వివరించి ఆసుపత్రిలో చేర్పించారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీకి సుఖ ప్రసవం చేసిన 108 సిబ్బందికి గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రసవ సమయంలో 108 సిబ్బంది ఈఎంపీ శివ లింగ ప్రసాద్ పైలట్ కరుణాకర్ లు ఉన్నారు.