బొమ్మనపల్లి గ్రామస్తులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ఏడు చర్లపల్లి పంచాయతీ బొమ్మల పల్లి గ్రామస్తులకు ఆదివారం వాజేడు పోలీసుల ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేశారు. భారీ వర్షాలు గోదావరి వరదల కారణంగా బొమ్మనపల్లి గ్రామాన్ని, వరద నీరు చుట్టు ముట్ట డంతో గ్రామస్తులు అష్ట కష్టాలు పడ్డారు. గత రెండు రోజులు గా గోదావరి వరద తగ్గిపోవడంతో పాటు, భారీ వర్షాలు కూడా తగ్గు ముఖం పట్టడంతో, బొమ్మలపల్లి గ్రామస్తులు ఒక్కసారి గా ఊపిరి పీల్చుకున్నారు. వరదలతో, భారీ వర్షాలతో సతమ తమవుతున్న బొమ్మలపల్లి గ్రామస్తులకు ఎంతో కొంత, ఊరట కలిపించేందుకు పోలీస్ శాఖ తమ వంతు సహాయం గా ప్రతి కుటుంబానికి కూరగాయల పార్సిల్ను పంపిణీ చేశారు. ఈ మేరకు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో,ఆయన చేతుల మీదుగా గ్రామస్తులకు ఆదివారం కూరగాయల పార్సిల్ లను పంపిణీ చేసే కార్యక్ర మాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ మరియు పంచాయతీ కార్యదర్శి గ్రామ పెద్దలు ఆదినారాయణ, సత్యనారాయణ, శేఖర్ పలు వురు యువకులు కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొ న్నారు. వరదల సమయంలో ఇబ్బందులు పడిన తమను, పోలీస్ అధికారులు పరామర్శించి కూరగాయలు పంపిణీ చేయడం పట్ల పలువురు పోలీస్ శాఖ అధికారులకు అభినం దనలు తెలిపారు.