బొగత జలపాతం సందర్శనకు అటవీశాఖ గ్రీన్ సిగ్నల్
– తండోపతండాలుగా తరలివస్తున్న పర్యాటకులు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం బొగత జలపాతం ను వారం రోజుల క్రితం అధికారులు మూసివేశారు. భారీ వర్షాలు,వరదలు కార ణంగా రికార్డు స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్న జలపాతం ప్రమాదకరంగా మారడంతో, ఉన్నతాధికారుఆదేశంపై జలపా తం సందర్శనను మూసివేశారు. భారీ వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో ఆదివారం నుండి జలపాతం సందర్శనకు అను మతి ఇచ్చారు. అయితే పర్యాటకులు కేవలం జలపాతం అందాలను మాత్రమే తిలకించాలని, స్నానాలు చేయరాదని, వాటర్ లోకి దిగరాదని ఆంక్షలు విధించారు. అలాగే మద్యం, ఇతర మత్తు పదార్థాలను కలిగి ఉండరాదని అటువంటి వారిపై చట్ట పర చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాజేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి. చంద్రమౌళి తెలిపారు.