మేడారంలో సమ్మక్క సారలమ్మ పూజారుల ధర్నా
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువై నటువంటి సమ్మక్క సారలమ్మల పూజారులు గద్దెల ఎదుట బుధవారం నల్ల బ్యాడ్జీ లతో నిరసన చేపట్టి దర్నా నిర్వహించారు. వరంగల్ జిల్లా కేంద్రంలో 1014 గజాల స్థలం మేడారం అసిస్టెంట్ కమిషనర్/ఎగ్జీక్యూటీవ్ ఆఫీసర్ పేరిట అప్పటి ప్రభుత్వం ఇచ్చిన భూమిని భద్రకాళి ఆలయ అధికారులు, అర్చకులు వేద పాఠశాల పేరిట చేస్తున్న కబ్జాను వ్యతిరేకిస్తూ నిరసన నువ్వు చేపట్టినట్లు పూజలు తెలిపారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు నిరసన కు సహకరించాలని పూజారులు కోరారు.