ధరణి పోర్టల్ వ్యవస్థ రద్దు కై పోస్ట్ కార్డ్ ఉద్యమం.
– గోండ్వానా సంక్షేమ పరిషత్
– ప్రజాభవన్ కి వేయి ఉత్తరాలతో వినతి.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురంలో మంగళవారం గొండ్వానా సంక్షేమ పరిషత్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రజలు ధరణి పోర్టల్ వ్యవస్థ ద్వారా తీరని అన్యాయానికి గురవుతున్నారని లక్ష పోస్ట్ కార్డ్లు ప్రజాభావన్ కి పంపేపోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో వలసలుగా గిరిజ నేతరులు వస్తూ, గిరిజనులు ఏండ్లతరబడి సాగు చేసుకున్న భూములను అధికారులకి, డబ్బులతో మభ్య పెడుతూ ధరణి పోర్టల్ లో నమోదు చేసుకుని పట్టాదారు పాసుపుస్తకాలు పొందుతు న్నారని అన్నారు. ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకుని క్రయ విక్రయాలు చేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి పాల్పడు తున్నారన్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమాలు జరగకుండా నిర్మూలించాలంట్టే, ధరణి పోర్టల్ వ్యవస్థ రద్దు చేసి,.ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సంఘాలతో కూడిన ప్రత్యేక కమిటీ నియమించాలని అన్నారు.5 వ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆర్టికల్ 244(1) ప్రకారంగా ఆదివాసులు నివసించే ప్రాంతంలో గిరిజనేతరులు వెళ్ల కూడదని, 1950/59 1/70 చట్టం నిబంధనలు ఉన్నప్పటికీ ఉల్లంఘి స్తూ గిరిజనేతరులు వలసలు వస్తున్నారని ఆయన అన్నారు.వలసలు నిరోధించాల్సిన అధికారులు మాత్రం సోద్యం చూస్తూ వారి జీవనానికి తోడ్పడే స్థిర నివాసం ఇంటి పన్నులు,విద్యుత్ మీటర్లు,ఓటు హక్కు,రేషన్ కార్డులు,ఏర్పాటు చేస్తూ ఆదివాసులను మరింత అడవికి పంపి, అజ్ఞాతం లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల అభి వృద్ధికి దోహదం పడేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధన కార్యదర్శి కణితి వెంకటకృష్ణ, జిల్లా కార్యనిర్వహక అధ్యకులు పూనెం ప్రతాప్, పూనెం గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.