ములుగులో బీజేపీ కొత్త ఆఫీసు
– ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు సిరికొండ
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలో బీజేపీ నూతన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో ప్రారంభించారు. సోమవారం ములుగు నూతన జిల్లా కార్యాలయ ప్రారంభో త్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు హాజరయ్యారు. కార్యాలయ ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి మార్తినేని ధర్మరావు మాట్లాడుతూ ములుగు జిల్లా నూతన అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి సిరికొండ బలరాం కు శుభాకాంక్షలు తెలిపారు. బలరాం అధ్యక్షతన రాబోయే రోజుల్లో జిల్లాలో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో పట్టిషం కావాదానికి ప్రతి ఒక్కరూ ఒక్కో కార్యకర్త సైనికుడిగా పని చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లడం లక్ష్యంగా గావ్ ఛలో ( పల్లెకి పోదాం అభియాన్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, సాంస్కృతిక పునరుద్ధరణ, విదేశాల్లో భారతదేశ గౌరవాన్ని పెంచడం వంటి అనేక రంగాలలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఎనన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అభివృద్ధి దార్శనికతను, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రజల మద్దతును కూడా పెట్టుకోని మరొకసారి మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునే విధంగా కార్యకర్త సోదరులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన ములుగు జిల్లా గిరిజన ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం గిరిజన వనదేవతలైన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ పేరు మీదుగా గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసి గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశ- వారన్నారు. ఈ అంశాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి గిరిజను పై ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న చిత్తశుద్ధిని వివరించాలని ఆయన కోరారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ యొక్క సుపరిపరిపాలనతో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడుస్తుందని రాబోయే ఎన్నికలలో 400 లకి పైగా సీట్లను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, యాప సీత- య్య భూక్య రాజు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నగరపు రమేష్, గాజుల కృష్ణ, గుగులోత్ స్వరూప, జిల్లా పదాధికారులు భూక్య జవహర్ లాల్, అడవ బిక్షపతి, శీలమంతుల రవీంద్రాచారి, గాదం కుమార్, పోదేం రవీందర్, మేడిశెట్టి ఓమ్రా, చల్లూరి మహేందర్, దొంతిరెడ్డి రవిరెడ్డి, జినుకల కృష్ణకర్ రావు, చందా జ్యోతి, ఎండీ యాకుబ్ పాషా, మండల అధ్యక్షులు కారుపోతుల యాదగిరి, మద్దినేని తేజరాజ్, మల్లెల రాంబాబు, గండిపల్లి సత్యం, లోడే శ్రీనుగౌడ్, కంది రాంకిషోర్, రఘురాం, వాసం మునిందర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు జాడీ సీతారామరాజు నేత, సీనియర్ నాయకులు పోల్సాని సునీల్ రావు, పోరిక ఉత్తమ్ కుమార్, సూర్యదేవర విశ్వనాథ్, భర్తపురం సరేష్, అల్లే శోభన్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.