కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలోని అనుబంధ దేవాలయం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వద్ద మంగళవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరించి కాలసర్ప పూజలు నిర్వహిం చారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు గోదావరి తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది.