సమ్మక్క సాగర్ బ్యారేజీని సందర్శించిన కలెక్టర్
తెలంగాణజ్యోతి,ఏటూరునాగారం:కన్నాయిగూడెం మండ లంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ లను మంగళవారం ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ సందర్శించారు. బ్యారేజీ వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీకి 59 గేట్లు ఉండగా కెపాసిటీ 6.94 టీఎంసీలని చెప్పారు. ప్రస్తుతం 32 గేట్లు ఓపెన్ చేశామని, 0.76 టీఎంసీ వాటర్ ఫ్లో అవుతుందని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ కు వివరించారు.