కస్తూర్బా గురుకులాన్ని సందర్శించిన డీఈఓ 

Written by telangana jyothi

Published on:

కస్తూర్బా గురుకులాన్ని సందర్శించిన డీఈఓ 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం కేజిబీవి పాఠశాలని జిల్లా విద్యా శాఖా ధికారి రాజేందర్, సెక్టోరల్ ఆఫీసర్ రాజగోపాల్ ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, ఆహార పదార్థాలు, కూరగాయలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హాజరు పట్టికను పరిశీలించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని కేజిబీవి కాటారం పాఠశాలలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చేసిన కృషిని కొనియాడుతూ ప్రిన్సిపాల్ చల్ల సునీత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చల్ల సునీత,,సరిత, అరుణ, విజయం, నళిని, లక్ష్మి, స్వప్న, సుజాత, కవిత, పి.ఇ.టి రాజేశ్వరి, ఏఎన్ఎమ్ లక్ష్మి, విద్యార్థినీలు పాల్గొన్నారు.

Leave a comment