ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసిన దళిత బంధు లబ్ధిదారులు

Written by telangana jyothi

Published on:

ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసిన దళిత బంధు లబ్ధిదారులు

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండ ల కేంద్రంలో గురువారం రెండవ విడుత దళిత బంధు లబ్దిదారులు ఎంపీడీఓ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి దుర్గం రాజేష్ మాట్లాడుతూ గతంలో మంజూరైన దళితబంధు నిధులను గ్రామ పంచా యితీ కార్యదర్శి, ఎంపీడీఓ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రౌండింగ్ అయి ప్రతి లబ్దిదారునికి అకౌంట్ లో డబ్బులు పడే సమయంలో ఎన్నికల కోడ్ ప్రకటించడంతో నిధులను నిలిపి వేశారు. ఇట్టి నిధులను దళిత బంధు లబ్దిదారుల అకౌంట్ లో జమ చేసి దళితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి దుర్గం రాజేష్ మాట్లాడుతూ గతంలో మంజూరైన దళితబంధు నిధులను గ్రామ పంచా యితీ కార్యదర్శి, ఎంపీడీఓ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రౌండింగ్ అయి ప్రతి లబ్దిదారునికి అకౌంట్ లో డబ్బులు పడే సమయంలో ఎన్నికల కోడ్ ప్రకటించడంతో నిధులను నిలిపి వేశారు. ఇట్టి నిధులను దళిత బంధు లబ్దిదారుల అకౌంట్ లో జమ చేసి దళితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారం రోజుల్లో గ్రామ ప్రత్యేక అధికారులు గ్రామాల సందర్శన చేసి మంజూరు యూనిట్ల స్థితి గతులను ఆరా తీస్తారని డిప్యూటీ సీఎం, బట్టి విక్రమార్క తెలిపారన్నారు. ఈ కార్యక్ర మంలో మండల నాయకులు మావురిగ వెంకటయ్య, గజ్జల రాజకుమార్, జనగాం రవీందర్, కుమ్మరి నర్సింగరావు, కుమ్మరి నాగార్జున్, జాడి రాజబాబు, సునరకాని సూర్యరావ్, కావిరి సురయ్యా, తిప్పనపల్లి లక్ష్మయ్య, కావిరి రోషరావు, వాసంపల్లి లక్ష్మి నారాయణ, వాసంపల్లి సురేష్, వాసంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment