పోగొట్టుకున్న ఫోన్ల అప్పగింత
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పోగొట్టుకున్న ఫోన్ల ను అప్పగించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం చురుకైన పాత్రను పోషీస్తుంది. ఇందులో భాగంగా జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి వారికి అప్పగించినట్లు కాటారం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మ్యాక అభినవ్ తెలిపారు. పోలీసు శాఖ ఆచరణాత్మకంగా అడుగు లు వేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సి ఈ ఐ ఆర్ తో పోగొట్టు కున్న ఫోన్లను అనతి కాలం లోనే వెతికి బాదితులకు అందజే యడం జరుగుతుంది. ఈ విషయంలో కాటారం పోలీసులు త్వరితగతిన బాధితులకు సేవలు అందించడంలో చూపెడు తున్న చొరవను ప్రజలు ప్రశంసిస్తున్నారు.