మృగశిరతో కిటకిటలాడుతున్న చేపల మార్కెట్
తెలంగాణ జ్యోతి, వెంకటాపురం నూగూరు : మృగశిర కార్తె సందర్భంగా పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారం, చేపలను కొనుగోలు చేసి, వాటిని భుజించే సాంప్ర దాయం నేటికీ కొనసాగుతున్నది. అందులో భాగంగా శనివా రం మృగశిర కార్తె ప్రవేశం రోజు, ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం చేపల మార్కెట్లో, దూర ప్రాంతాల నుండి వచ్చిన చెరువు పెంపకం చేపలతో పాటు, గోదావరి చేపలు, ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మార్కెట్లోకి వ్యాపారులు తీసుకువచ్చి విక్రయించారు. కొంత మంది గోదావరి నది ప్రాంతానికి వెళ్లి మత్స్యకారుల వలలో పడిన తాజా చేపలను వేకువ జాము నుండే అక్కడి కక్కడే కొనుగోలు చేసి ఇళ్లకు పట్టుకోచ్చారు. దూర ప్రాంతాల నుండి చెరువులో పెంపకం చేపలు, ఇతర ప్రాంతాల నుండి వెంకటా పురం చేపల మార్కెట్ లో కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్నది. మరి కొంతమంది శనివారం రోజు వచ్చిందని అయినా, కానీ చేపలను తినే సాంప్రదాయాన్ని కొనసాగి స్తామని, మరి చేపలను కొనుగోలు చేసి చేపల పులుసు, ముక్కల వేపుళ్ళతో వారి, వారి ఇళ్లల్లో చేప ముక్కలకు దట్టీంచిన మసాలా సువాస నలతో ఘమ, ఘమ లాడు తున్నాయి. మృగశిర కార్తె సందర్భంగా, చేపలను కొనుగోలు చేసేందుకు క్యూలు కట్టడంతో, చికెన్, మటన్ షాపులు లో బేరాలు తగ్గటంతో వెల,వెల పోయాయి.