ఆ గ్రామాలను వేరే చోటికి మార్చండి 

Written by telangana jyothi

Published on:

ఆ గ్రామాలను వేరే చోటికి మార్చండి 

– ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి

– మంత్రి ఉత్తమ్ కు కాంగ్రెస్ నేత ప్రభాకర్ రెడ్డి వినతిపత్రం

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతున్న గుండ్రత్ పల్లి, గంగపురి, మల్లారం, దామర కుంట, గ్రామాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని వినతి పత్రం సమర్పించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని ఆయన మంత్రిని కోరారు.

Leave a comment