ఎన్ ఎ స్ఎస్ శిబిరాన్ని ప్రారంభించిన కో ఆర్డినేటర్ నారాయణ
నేటితో ముగిసిన ఎన్ ఎ స్ఎస్ ప్రత్యేక శిబిరం.
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఏడు రోజుల ముగింపు ప్రోగ్రాంను ఆదివారం ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్, కాకతీయ యూనివ్సిటీ ప్రొఫెసర్ నారాయణ ప్రారంభించారు. ఈ ముగింపు శిబిరం సాంస్కృతిక సాంప్ర దాయాలతో, నృత్యాలతో ఉపన్యాసాలతో ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా కార్య క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ నారాయణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నారాయణ మాట్లాడుతూ ఎన్ ఎస్ ఎస్ టీం మూడు సంవత్సరాల వరకు టి టి డబ్ల్యూ ఆర్ డి సి గర్ల్స్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ టీం ప్రతి సంవత్సరం ఈ గ్రామాన్ని సందర్శించి క్యాంపులు నిర్వహించాలని కోరారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, ములుగు కళాశాల డాక్టర్ కే రాధిక మాట్లాడుతూ ఎన్ ఎస్ ఎస్ ఏడు రోజుల కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే టిటిడబ్ల్యూ ఆర్ఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ఎస్ఎస్ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. చిన్న బోయినపల్లి ఆశ్రమ పాఠశాల వార్డెన్ ప్రభాకర్, గ్రామ పెద్దలు చంద్రమౌళి నరసింహారెడ్డి, సుజాత, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల బృందం అమూల్య అనూష, సుకన్య, రజిని తో పాటు వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, రాజశేఖర్ గౌడ్, ప్రసాదు, ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ పాల్గొన్నారు.