తుక్కుగూడ సభకు తరలిన కాంగ్రెస్ నాయకులు.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి: మహాదేవపురం మండలం కాళేశ్వరం కాంగ్రెస్ పార్టీ మండల బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెంగాని అశోక్ ఆధ్వర్యంలో స్థానిక కార్యకర్తలు, నాయకులు తుక్కుగూడ భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ కాళేశ్వర నుండి దాదాపు 60 మంది నాయకులు జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ ,జై శ్రీధర్ బాబు నినాదంతో తుక్కుగూడ సభకు తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అన్నారు.