గిరిజన శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

Written by telangana jyothi

Published on:

గిరిజన శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

కాటారం,తెలంగాణజ్యోతిప్రతినిధి: గిరిజన శాఖలో కాంట్రా క్టు పద్ధతిపై ఉద్యోగం చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలనీ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలురు,బాలికలు) కాటారంలో చలో హైదరాబాద్ కర పత్రాన్ని ఆవిష్కరించారు. గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతి పై విధులు నిర్వహిస్తున్న వారిని గత పాలకులు మోసం చేశారని వివరించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో 1804 కాంట్రాక్టు ఉపాధ్యాయులు గిరిజన సంక్షేమ గురుకులాలలో 491 కాంట్రాక్టు బోధనేతర ఉద్యోగులు, గిరిజన సహకార సంస్థలలో 94 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో 10 సంవత్సరాలు, కెసిఆర్ ప్రభుత్వంలో 10 సంవ త్సరాలు కాలయాపన చేసి మోసం చేశారని వివరించారు. గురుకులాల్లో పార్ట్ టైం ఉద్యోగులకు, 12 నెలల జీతాలు ఇవ్వాలని, స్లీపింగ్ శానిటేషన్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి, ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు . ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బచ్చ ల ఎర్రయ్య, పార్ట్ టైం ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షు లు భూక్యా రాజు, వేల్పుల సంపత్, దోమ రామకృష్ణ, మంతె న శ్రీనివాస్ , కృష్టమాచారి సర్దార్ సింగ్, స్వప్న, పద్మ, రజిత, రాజశేఖర్, యాకమ్మ, రజిత, నాన్ టీచింగ్ స్టాప్ సారక్క, రాజేశ్వరి, పెండ్యాల సత్యనారాయణ, అల్లం మల్ల య్య, గట్టు రవీందర్, బీసులశ్రీనివాస్, హట్కర్ రాజు, పోలం మల్లమ్మ, మాడి రాజయ్య, పొలం చిన్నయ్య, ఖమ్మం నాగయ్య తదిత రులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now