ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలంలో చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను కేంద్ర బృందం పరిశీ లించింది.ఇందులో భాగంగా కాటారం మండలం నస్తూర్ పల్లి, కాటారం లలో ఉపాధి హామీ పనులను వారు పరిశీలించారు. సెంట్రల్ సెక్రెటరీ సెక్షన్ ఆఫీసర్ల శిక్షణలో భాగంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వాటర్ హార్వెస్టింగ్ పాండు, సెరిగ్రేషన్ షెడ్డు, క్లీమటోరియం (వైకుంఠ ధామం), పల్లె ప్రకృతి వనం, నర్సరీ మొదలగు పనులను సందర్శించారు. ఉపాధి కూలీలతో పనుల వివరాలు, చెల్లింపుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ వస్తున్నదా లేదా అని వివరాలు ఆరా తీశారు. వారితో కాటారం మండల ఏపీవో వెంకన్న, ఈసీ మెంబర్ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ మనోజ్, పంచాయతీ కార్యదర్శిలు షఘీర్ ఖాన్, సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు రాజేష్, నీతి అయోగ్ బృందం ఉన్నారు.