కాళేశ్వరంలో ఇంటింటి ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీదర్ బాబు , శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ బాబు ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి కాళేశ్వరం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ కృష్ణ కు ఓట్ వేసి అత్యధిక మెజార్టితో గెలిపించాలని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు ను గెలిపించిన మాదిరిగానే వంశీ కృష్ణ ను కూడా అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీ లను వివరించి ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణ మాఫీ అమలు చేస్తామని, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెంగాని అశోక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు మంగ లక్ష్మణ్, ఎంపీటీసీ రేవెల్లి మమత నాగరాజ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కామెడీ శ్రీనివాస్ రెడ్డి, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బందెల సత్తెమ్మ,, మండల మహిళా కార్యదర్శి కామెడీ లక్ష్మి, మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాడుగుల పవన్ శర్మ, కాంగ్రెస్ పార్టీ మండల కోశాధికారి గందేసిరి సత్యనారాయణ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గందెసిరి మధుసూదన్,జానీ, సారయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “కాళేశ్వరంలో ఇంటింటి ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు”