సంక్షేమానికి చిరునామా కాంగ్రెస్
– పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– రాజ్యాంగాన్ని పరిరక్షిస్తేనే యువతకు భవిష్యత్తు
– బహిరంగసభలో దుద్దిల్ల శ్రీనుబాను
– నియోజకవర్గ కోఆర్డినేటర్ జంగా రాఘవరెడ్డి
కాటారం,తెలంగాణజ్యోతి:దేశ,రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని నియోజకవర్గ కోఆర్డినేటర్ జంగా రాఘవరెడ్డి, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీనుబాబులు అన్నారు. సోమ వారం కాటారం, గాదపెల్లి గ్రామాలలో పాదయాత్ర నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి, మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని, స్వాతంత్రం కోసం ఎందరో మహనీయు లు ప్రాణత్యాగం చేశారని, దేశాన్ని, రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగం పరిరక్షించబడిందని అన్నారు. అభివృద్ధి చేశారని అతని ఆశయ సాధన కోసం మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాఘవరెడ్డి తెలి పారు. నియోజకవర్గంలో సాగునీరు, విద్య అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉందని రాబోయే కాలంలో ఐటి పార్క్ తో పాటు కంటి ఆసుపత్రికి నిర్మాణం జరగబోతున్నదని తెలిపారు. బహిరంగ సభకు హాజరైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేత వేణుబాబు రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నమని, అదే బాటలో పయనిస్తామని శ్రీను బాబు వెల్లడిం చారు. రాజ్యాంగం పరిరక్షణకు నడుం బిగించాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాటారం మండలంలోని గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నెల 14 వరకు జరుగుతుందని అన్ని గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు భాగస్వాములై ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ప్రాధాన్యం తగ్గిం చే విధంగా, అంబేద్కర్ను అవమానపరిచే విధంగా పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడం బాధాకరమ న్నారు. మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్స రాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా మన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాం గాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు.గాంధీ,అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. బి.ఆర్.ఎస్ పదేళ్ల పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలంగాణ ఉద్యమకారులకు ఎవరిని ఆదుకోలేదని రాఘవరెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ అనుబంద సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.