దత్తాత్రేయ దేవాలయంలో భజన సంకీర్తనలు
కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారం మండలంలోని శ్రీ దత్తాత్రేయ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం రాత్రి భక్తులు సంగీత విభావరి నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కీర్తనలు పాడుతూ దేవదేవున్ని స్మరించారు. అర్చనా ఆర్కెస్ట్రా బృందం సుమారు నాలుగు గంటల పాటు సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనుబాబు, తల్లి జయమ్మ, గ్రామ ప్రజలు, ఆలయ పురోహితులు, భక్తులు, పాల్గొన్నారు.