కరాటే పోటీలలో మెడల్స్ సాధించిన విద్యార్థులకు అభినందనలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా ఎటూరునాగారంలో ఆదివారం 6 వ రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంట్ లో నూగూరు వెంకటాపురం మండలం కు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థు లు పోటీలలో పాల్గోని తమ సత్తా చాటి, మెడల్స్ సాధించారు. ఉత్కంఠ భరితంగా ఏటూరునాగారం గిరిజన భవనం నందు నిర్వహించారు. ముఖ్య అదితిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనుసరి సీతక్క, పి.ఒ. అంకిత్ డిసిడిఒ మెడమ్ రమాదేవి, వెంకటాపురం జడ్పీటీసీ పాయం రమణ పలువురు ప్రముఖులు సమక్షంలో కరాటే టోర్నమెంటు లు జరిగాయి. ఈ టోర్నమెంట్ కు వెంకటాపురం మండలం నుండి 66 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. టోర్నమెంట్ నందు 35 మంది గోల్డ్ మెడల్స్ సాధించారు. 14 మంది సిల్వర్ మెడల్స్ సాధించారు,17మంది విద్యార్థులు కాంస్య పధకాలు సాదిచారు. మెడల్స్ సాదించిన విద్యార్థిని విద్యార్థులను సోమవారం స్దానిఖ పి.ఎస్.లో వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ , ఎస్.ఐ. ఆర్. ఆశోక్ లు విద్యార్దులు ను అభినం దించారు. విద్యార్దులు ఆత్మ స్ధెర్యాన్ని పెంచుకోని, ఉన్నత శిఖరాలకు ఎద గాలని ప్రోత్సాహించారు. టోర్నమెంట్ ఛీప్ ఆర్గనైజింగ్ మరియు సూర్య షోటోకాన్ అకాడమీ పౌండర్ పాయం సురేష్ , కరాటే మాష్టర్స్ గొంది హనుమంత్, టీచర్. పసుల సూర్యనారాయణ , పూనెం రామారావు, గొంది స్నేహిత్ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ ను విజయవంతం చేయుటకు సహయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ,. విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.