నస్తూరుపల్లి ఉపాపాధ్యాయుడికి అభినందన వెల్లువ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : నస్తూరుపల్లి పాఠశా లలో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న కురసం అశోక్ కుమార పిల్లలు కురుసం అశ్వత్, కురుసం హారిక ఇద్దరు అదే పాఠశాలలో మూడవ తరగతి చదువడం పట్ల వారిని గుర్తించి ఉపాధ్యాయుడిని అభినందించారు. కాటారo మండలంలోని ఎంపిపిఎస్ నస్తూరుపల్లి పాఠశాలను మండల విద్యాధికారి ఇంజపల్లి శ్రీదేవి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల నిర్వహణను పరిశీ లించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఇంజాపల్లి శ్రీదేవి మాట్లాడుతూ కురసం అశోక్ కుమార్ లాంటి యువ ఉపాధ్యాయులు ఇలా ముందుకు వచ్చి తమ పిల్లలని ప్రభు త్వ పాఠశాలలో చదివించడం ద్వారా ప్రజలలో ప్రభుత్వ పాఠ శాలల పట్ల గౌరవం పెరుగుతుందని, అంతేకాకుండా విద్యార్థు లలో ఆత్మవిశ్వాసం కూడా పెంపొందించ గలుగుతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడైన కురుసం అశోక్ కుమార్ ని వివరాలు అడగగా చిన్నప్పటి నుండి తాము కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఈ స్థాయికి వచ్చామని, బహుళ విజ్ఞా నం కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే దొరుకుతుందనే నమ్మకం తో నేను కూడా నా పిల్లలను మన ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం తెలుసు కున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా పిఆర్టియు తెలంగాణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రాచర్ల శ్రీనివాస్ , పసుల శంకర్ నేత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తమ పిల్లలను చేర్పించడం శుభపరిణామం అనీ, ఉపాధ్యా యుడు కురుసం అశోక్ కుమార్ కి జిల్లా శాఖ పక్షాన అభినం దనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధి కారితో పాటు రఘునందన్ తోటి ఉపాధ్యాయురాలు యం. శారద పాల్గొన్నారు.