పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
– వెంకటాపూర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ కమ్మరన్నిస్పా బేగం
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : పోషకాలతో కూడిన పౌష్టికాహారంతో తల్లులకు, గర్భిణీ బాలింతలకు, పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని వెంకటాపూర్ సెక్టార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ కమ్మరన్నిస్పా బేగం అన్నారు. శుక్రవారం వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట మద్దెల సంద్య అంగన్వాడి సెంటర్లో కార్యక్రమం ఘనంగా నిర్వ హించారు. పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో వచ్చే చిరుధాన్యాలు, గుడ్లు, ఆకు కూరలు వలన కలిగే లాభాలను వారు వివరించారు. అంగన్వాడి కార్యకర్తలు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామాల్లో మహిళలు గర్భిణీలు, బాలికల, పిల్లల రక్తహీనత తగ్గించేందుకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు,పిల్లలు ఎలాంటి సమస్య ఉన్న 181,1098, ఫోన్ చేసి సేవలను సద్విని యోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గోగు స్వరూప, అంగన్వాడి టీచర్లు కొండ మాధవి ,రజిని ,సబిత ,గీత , ఏఎన్ఎంలు స్వర్ణలత, వజ్ర , ఉమెన్ హబ్ స్రవంతి ,చైల్డ్ లైన్ నాగమణి ,ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.