వెంకటాపురంలో రంగురంగుల నాటు కోళ్లు.
– రంగురంగుల కోడి పిల్లలు విక్రయాలు.
– ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం పట్టణ కేంద్రంలో, రకరకాల నాటు కోళ్లు, కోడి పుంజులను విక్రయాలు జరుపుతున్నారు. అలాగే ఆంధ్ర లోని విజయవాడ,గన్నవరం ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సుమారు పది రోజులు వయసున్న కోడి పిల్లలకు రంగులు వేసి విక్రయాలు జరుగుతున్నారు. రకరకాల రంగుల తో కోడి పిల్లల ను ఓపెన్ చేసిన బుట్టలలో కీస్, కీస్ అంటూ రంగురంగుల కోడి పిల్లలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఒక్కొక్క రంగుల కోడి పిల్ల పదిరూపాలవంతున వ్యాపారులు విక్రయిస్తున్నారు. అలాగే నాటు కోళ్లు సైతం జత ఆయా సైజులను బట్టి బరువును బట్టి 1 వేయి నుండి 1400 రూ. వరకు విక్రయాలు చేస్తున్నారు. మారుమూల ఏజెన్సీ వెంకటాపురం, వాజేడు మండలాలలో నాటు కోళ్ల పెంపకం తో పాటు, పట్టణ ప్రాంతాల నుంచి వివిధ రకాల పక్షి జాతి కోళ్ళు అధిక బరువు పెరిగే కోళ్ల జాతి పిల్లలను ముఖ్యంగా సోదర గృహిణులు కొనుగోలు చేసి, కోళ్ల పెంపకం తో కుటుంభ అవసరాలకోసం అదనపు ఆదాయం పొందేందుకు తాపత్రయం పడుతున్నారు. ప్రస్తుతం మేడారం జాతర సందర్భంగా మేక పోతులు, పొట్టేలు లకు వేలాది రూపాయలు ధరలు పలుకు తుండగా, నాటుకోడి పుంజులకు బరువుతో సంబంధం లేకుండా పీస్ రేటుగా 1,500/ రూపాయలు నుండి 2 వేల వరకు ధరలు మండిపోతున్నాయి. అంతేకాక నాటుకోడి చికెన్ కు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉండటంతో, పెరటి తోట కూరగాయల పెంపకం తో పాటు, కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం తో ముఖ్యంగా సోదరీమణులు, గ్రుహిళులు వాటిని కొనుగోలు చేసి పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు.