TSRTC – జాతరకొచ్చే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ బిగ్‌షాక్..!
– బస్సుల్లో కోళ్లు, గొర్రెలకు ప్రవేశం లేదు
డెస్క్, తెలంగాణ జ్యోతి : మేడారం మహాజాతర వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. మేడారం బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు ఎంట్రీ లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకురాకుండా భక్తులు సహకరించాలని సజ్జనార్ కోరారు. మేడారం జాతర నేపథ్యంలో సజ్జనార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మేడారం జాతర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6వేలకు పైగా బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. మునుపెన్నడూ లేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని మేడారంలో 15 కిలోమీటర్ల మేర 48 క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని ఎండీ సజ్జనార్ సూచించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు కోళ్లు,గొర్రెలు, మేకలను అమ్మవార్లకు మొక్కులుగా చెల్లించడం ఆనవాయితీగా కొనసాగుతుంది.