గోదావరి ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృత పర్యటన

Written by telangana jyothi

Published on:

గోదావరి ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృత పర్యటన

– వరదల కుముందే ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కలెక్టర్ దివాకర గురువారం నూగూరు వెంకటాపురం మండలంలో గోదావరి వరదలకు ముంపు కు గురి అయ్యె గ్రామాలను, వాగులను, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో సంభవించే గోదావరి వరదలు, భారీ వర్షాల కారణంగా గ్రామాల ప్రజలకు వరదల కారణంగా నష్టం జరగకుండా, గ్రామాల్లో ప్రజలకు అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వరదల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులను తరలించే అంశం తో పాటు, పునరావాస వరద బాధిత కేంద్రాలలో వారిని ఉంచేందుకు తగిన ఏర్పాట్లు కూడా ముందుగానే,యాక్షణ్ ప్లాన్ తో సిద్ధం చేసుకోవా లన్నారు. అలాగనే వరదల సమయంలో వైద్య ఆరోగ్య శాఖ శాఖ అంటూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవా లన్నారు. ఈ మేరకు మండలంలోని అన్ని పంచాయతీల కార్యదర్శిలకు, పంచాయతీ పరిపాలన అధికారులకు పౌర శాఖల అధికారులకు ప్లడ్ డ్యూటీ సందర్భంగా ముందుగానే సమావేశాలు నిర్వహించి, రికార్డుల ప్రకారం ముంపు కు గురయ్యే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ,ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మండలంలోని కంకల వాగు, బల్లకట్టు వాగు, పాలెం ప్రాజెక్టు పరిసరాలను ములుగు జిల్లా కలెక్టర్ అధికారులతో పరిశీలించి, వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అక్కడి కక్కడే ఆదేశాలు జారీ చేశారు. అలాగే వి ఆర్ కె పురం లో ఆర్డబ్ల్యూఎస్,సర్వే మరియు నీటీ సరఫరా తదితర అంశాలపై ఆర్. డబ్ల్యు. ఎస్ అధికారుల తో నీటిసరఫరా అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో మంచినీటి సరఫరా, పైపులైనుల మరమ్మత్తులు లీకేజీలు, ఎప్పటిక ప్పుడు వెరిఫై చేసి ఆయా గ్రామాల ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ పర్యటనలో మండల తాసిల్దా ర్ వీరభద్ర ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేం ద్రప్రసాద్, మండల స్పెషల్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారిహనుమంతరావు, ఆర్డబ్ల్యూఎస్ డీ.ఈ వెంకట సతీష్ ,ఏ.ఈ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా నూతన కలెక్టర్ దివాకర్ వెంకటాపురం పర్యటన సందర్భంగా వివిధ సమస్యలను కలెక్టర్ గారికి విన్నవించుకునేందుకు,వినతి పత్రాలతో అనేక గ్రామాల నుండి వచ్చిన గిరిజనులకు కలెక్టర్ తహసీల్దార్ కార్యాల యానికి రాకపోవడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు.

Leave a comment