జలకళను సంతరించుకున్న బొగత జలపాతం.
– ప్రారంభమైన సందర్శకుల సందడి.
తెలంగాణా జ్యోతి, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద బొగత జలపాతం గత రెండు రోజుల నుండి ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలతో తిరిగి జలకళను సంతరించుకున్నది. వేసవికాలం సందర్భంగా జలకళను కోల్పోయిన తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన జలపాతం ప్రకృతి రమణీయ దృశ్యాలను తిలకించేందుకు, వెంకటాపురం, వాజేడు, ఎటూరునాగారంతో పాటు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుండి సందర్శకులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.