అన్నారంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన సిఐ రామచంద్రరావు

అన్నారంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన సిఐ రామచంద్రరావు

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో మహాదేవపూర్ సీఐ రామచందర్రావు,కాళేశ్వరం ఎస్సై సిహెచ్ చక్రపాణి ఆధ్వర్యంలో 12 సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నారo గ్రామ ప్రజలను సిఐ అభినందించారు. అనంతరం సిఐ రామచందరావు గ్రామ ప్రజలతో సమావేశమై మాట్లాడుతూ సిసి కెమెరాలు నేరాలు నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడతాయని, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెహికల్ నెంబర్ గుర్తించి నేరస్తులను పట్టుకోవ డానికి, రాత్రి సమయంలో దొంగతనాలు జరిగినప్పుడు దొంగ లను గుర్తించడానికి సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతా యన్నారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు నూతన చట్టాలు, సైబర్ నేరాలపై, డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు, గుట్కాలు అలవా టు చేసుకోని ఆరోగ్యం పాడుచేసుకోవద్దని‌ తెలిపారు. యువ త దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్ప డాలని సూచించారు. ఒక వ్యక్తి డ్రగ్స్‌ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్‌ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని, మత్తులో నిద్రిస్తాడని, క్రూర మైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు. విద్యార్థు లు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్‌ వినియోగిస్తున్న ట్టు అనుమానం వచ్చినా, విక్రయిస్తున్నట్టు తెలిసిన పోలీసు లకు సమాచారం అందిచాలని, అప్పుడు మాత్రమే డ్రగ్స్‌ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు. అదేవిధంగా లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయరాదని డ్రైవింగ్‌ చేస్తున్నప్పు డు పాటించవలసిన రహదారి నియమ నిబంధనలను వివర ణాత్మకంగా వివరించారు. అదేవిధంగా గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామంలోని ప్రజలు ఎవరు కూడా మావోయిస్టులకు సహకా రం అందించాలని, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చట్ట పరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment