నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద డైవర్షన్ రోడ్డు మరమ్మత్తు లు చేయించండి మహాప్రభో
– రాచపల్లి, మల్లాపురం,రైతులు, ప్రజల వినతి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం శివాలయం వెనుక మల్లాపురం రోడ్ కంకలవాగువంతెన పై పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యం లో సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో భారీ వంతెన నిర్మాణం గత ఏప్రిల్ నెలలో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. పిల్లర్స్ వరకు మాత్రమే వంతెన నిర్మాణం పూర్తయింది. ఈలోగా జూన్ నెలలో తొలకరి వర్షాలు, భారీ వర్షాలు, వరదల కారణంగా కంకల వాగుపై వద్దన నిర్మాణ పనులు వరదల కారణంగా నిలిపివేశారు. అయితే వంతెన నిర్మాణం ప్రారంభం సమయంలో డైవర్షన్ రోడ్డును, సిమెంట్ పైపులు వేసి, కాంట్రాక్టర్ నిర్మించారు. భారీ వర్షాలుతో వరదల కారణంగా వాగులు పొంగటంతో డైవర్షన్ రోడ్డు కొట్టుకుపో యింది. దీంతో ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే మల్లాపురం, రాచ పల్లి ,మొట్ల గూడెం, కరవోని గుంపు తదితర ఆదివాసి గ్రామాల ప్రజలతో పాటు,వెంకటాపురం రైతులు రాకపోకలు సాగించేందుకు, రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతు న్నారు. గత సెప్టెంబర్ నెల నుండి వర్షాలు లేకపోవడంతో వంతెన నిర్మాణ కాంట్రాక్టర్ రైతులు, గిరిజన గ్రామాల ప్రజల సౌకర్యం కోసం, కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డుకు మరమత్తు లు చేయక పోవటం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు .దీంతో వేలాది ఎకరాల ఆయకట్టు కలిగిన వరి, మిర్చి పంటలు వేసిన రైతుల తో పాటు, ఆయా గ్రామాల ఆదివాసి ప్రజలు, రైతులు, చొక్కా ల నుండి చుట్టూ తిరిగి వెళ్లి, తమ వరి పంట పొలాలు, మిర్చి, మొక్క జొన్న తోటలకు మందు బస్తాలు, ఇతర పనులకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వెనుక బడి పోయి శీతాకాలం ప్రారంభమై కావస్తు న్న కొట్టుకుపోయిన ,డైవర్షన్ రోడ్డు మరమ్మతులు చేయక పోవడంతో, కేవలం కాలినడక మాత్రమే అవకాశం ఉండటం తో రైతులు, ఆదివాసి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బంది ని ద్రుష్టి లో పెట్టుకొని డైవర్షన్ రోడ్డు మరమ్మతు నిర్మాణ పనులు వెంటనే నిర్వహించాలని ,నూతన వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని వ్యవసాయ పనులకు ఆటంకం లేకుండా డైవర్షన్ రోడ్డుకు మరమ్మత్తుల పని చేపట్టాలని ఆయా గ్రామాల ఆది వాసులు, రైతులు పత్రికా ముఖంగా ములుగు జిల్లా కలెక్టర్ కు,ఐటిడిఎ ప్రాజెక్టు అధికారికి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.