బాల్య వివాహాలు ఓ సామాజిక దురాచారం

Written by telangana jyothi

Published on:

బాల్య వివాహాలు ఓ సామాజిక దురాచారం

– దాని వల్ల సమాజంలో అభివృద్ధి తిరోగమిస్తుంది

– బాలల పరిరక్షణ అధికారి హరికృష్ణ.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని కెజిబివి పాఠశాలలో బుదవారం జిల్లా బాలలపరిరక్షణ విభాగము ములుగు ఆధ్వ ర్యంలో బాల్య వివాహల నిరోధానికి దేశవ్యాప్తంగా నిర్వహి స్తున్న “బాల్ వివాహ్ ముక్త్ భారత్” కార్యక్రమాన్ని నిర్వహిం చారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగము నుండి, వాజేడు మండల ఇంచార్జీ కె.సుమన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మానికి బాలల పరిరక్షణ అధికారి హరికృష్ణ ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు బాలికల అభివృ ద్ధికి నిరోధకాలు అని అన్నారు. ఒకప్పుడు బాల్య వివాహాలు వివిధ కారణాల వలన జరిగేవని, సమాజం బాగా నాగరికం గా అభివృద్ధి చెంది నప్పటికీ నేటికీ బాల్యవివాహాలు జరగడం దురదృష్టకరం అన్నారు. బాలికలు తమ హక్కులపై అవగా హనతో ఉండాలని, ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వారు సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం అదేవిధంగా బాల్యవివాహాల, నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా “బాల్ వివాహ్ ముక్త్ భారత్” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. అనం తరం బాల్య వివాహ నిషేధ చట్టం – 2006 పై అవగాహన కల్పించారు.అనంతరం పాఠశాల అదికారి శ్రీమతి . సుజాత మాట్లాడుతూ, ఆడపిల్లలు ఎవరికీ తక్కువ కాదని, వారు ప్రతీ సమస్యను ధైర్యం తో పరిష్కరించుకునే నేర్పును ప్రదర్శిం చాలని అన్నారు. బాల్యవివాహాలు సామాజిక దురాచారం అని దాని నిర్మూలన కొరకు కృషిచేయాల్సిన భాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు.  అనంతరం వాజేడు మండల ఇంచార్జీ సుమన్ మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాలు తగ్గించడం మరియు ఇతర బాలల హక్కుల పరిరక్షణ అంశాలపై, జిల్లా బాలల పరిరక్షణ విభాగము ములుగు & చైల్డ్ హెల్ప్ లైన్ లో ఆధ్వర్యంలో, అందిస్తున్న బాలల పరిరక్షణ సేవలను వివరించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆపత్కాల సమయం వచ్చిన వెంటనే పిల్లలు 1098, 112 మరియు 100 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని విద్యార్థిని లకు సూచించారు. చివరగా బాల్య వివాహ నిర్మూలనలో తమ వంతు భాధ్యత వహిస్తామని ఈ కార్యక్రమంలోపాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈకార్యక్రమంలో వాజేడు పాఠశాల ఉపాధ్యాయినిలు, కరాటే కోచ్ హనుమంత్, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now